Breaking News

జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శి గా ఎన్.వి.ఎస్ ప్రసాద్ నియామకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శి గా ఎన్.వి.ఎస్ ప్రసాద్ ని నియమించినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. విజయవాడ చెందిన ఎన్.విఎస్ ప్రసాద్ బీసీ సంఘం హక్కులకోసం సేవలందించి బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని, ఎల్లవేళలా బీసీలకు అందుబాటులో ఉండి బీసీల కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంఘం పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త కమిటీలు  వేశారన్నారు.

జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ను తుంగలో తొక్కిన వ్యక్తి మోదీ అని, కేంద్ర పెద్దలు రాష్ట్రాన్ని ముక్కలు చేసారని, బీజేపీ, జనసేన పార్టీలు ఆంధ్ర పై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.తల్లిదండ్రులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దిక్కు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని అణచివేసే కుట్రలు కేంద్రం చేయవద్దని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ గతే బీజేపీకి, జనసేనకు కూడా పడుతుందని జోస్యం చెప్పారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ అని మొదటి నుంచి చెబుతున్నట్లు గుర్తు చేశారు. దాన్ని ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు.వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిందే అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఐదు దశాబ్దాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మహోజ్వల పోరాటం మంచి స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని స్పష్టం చేశారు. గొప్పలు చెప్పుకునే ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *