విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతమ్మ అమ్మవారి తిరనాళ్ళలో జరిగిన ప్రభల ఘర్షణల మీద ఏకపక్షంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా రూరల్ జోన్ డి.సి.పి మహేశ్వర రాజు ని కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్,జాగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. 17-03-2025 న తెల్లవారు జామున శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లసందర్బంగా అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం పసుపు కుంకుమలు సమర్పించుటకు అన్ని రాజకీయ పార్టీల వారు ప్రభలు కట్టుకొని వస్తుండగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ కూడలి సమీపంలో టీడిపి.వైసీపీ వర్గీయలు మధ్యలో ఘర్షణలు జరిగి ఇరు వర్గాల వారు చెప్పలు రాళ్లు ఇసురుకోగా మధ్యలో ఉన్నారు పోలీస్ వారికీ తగిలి కొందరికి గాయాలు అయినవి ఇది దురుదుష్టం యదార్థం!సదరు పోలీసువారు ఏకపక్షంగా కేవలం వైసీపీ కార్యకర్తలు పైనే కేసులు కట్టడం బాధాకరం.. సదరు విషియాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాళ్లు విసురుకున్నాది ఇరుపార్టీ వారు కావునా డిపార్ట్మెంట్ వారికీ దెబ్బలు తగలటవలన ఇరుపార్టీల వారిపై కేసులు కట్టవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో జిల్లా రైతు విభాగం అద్యక్షులు ఏలూరి శివాజీ,దుర్గ గుడి మాజీ డైరెక్టర్ నంబురి రవి,mpp గాంధీ తదితరులు పాల్గొన్నారు.
