-రాష్ట్రంలోని పశు వైద్య విద్యార్థులపై చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు దుర్మార్గమైనది.
-మెడికల్ విద్యార్థులతో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు (స్టైఫండ్) గౌరవ వేతనం అమలు చేయాలి.
-కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశు వైద్య విద్యార్థులు 44 రోజులుగా సుదీర్ఘ నిరసనలు నిరాహార దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమనీ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పశు వైద్య విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవప్రదమైన గౌరవ వేతనాన్ని అందిస్తున్నాయని అందులో రాజస్థాన్ 24000/-, ఉత్తరప్రదేశ్ 23,500/-, కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 20,000/-, హర్యానాలో 17,000/-, పంజాబ్ 15,000/- రూపాయలను పశు వైద్య విద్యార్థులకు గౌరవ వేతనంగా ఇస్తున్నారని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు వైద్య విద్యార్థులకు ఏడాదికి కేవలం 7,000/- ఇచ్చి సరిపెడుతుందని.. రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యవసర ధరల దృష్ట్యా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఏ విధంగానూ సరిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ విద్యార్థులకు పెంచిన విధంగానే పశువైద్య విద్యార్థులకు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ ఇన్నేళ్లుగా గత ప్రస్తుత ప్రభుత్వాలు పశు వైద్య విద్యార్థులకు గౌరవ వేతనాన్ని పెంచకుండా తీరని ద్రోహం అన్యాయం చేసిందని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) ఆంధ్రప్రదేశ్ తరపున విద్యార్థుల పక్షాన ఎలాంటి పోరాటాలైన చేయడానికి వెనుకాడబోదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.
Prajavartha Online Telugu News