Breaking News

ఇళ్లస్థలాలు మెరక చేసే పనుల్లో జాప్యం చేయరాదు : జిల్లా కలెక్టర్ జె. నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్లస్థలాలు మెరక చేసే పనులు వేగవంతం చేసి అన్ని లేఅవుట్లలో అవసరమైన అనుసంధాన రహదారులు ఏర్పాటుచేయడంలో అధికారులు ఏ మాత్రం జాప్యం చేయరాదని కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో సోమవారం ఆయన రెవెన్యూ, డ్వామా అధికారులు, ఎంపీడీవోలతో జిల్లాలోని 49 మండలాలలో ఇళ్లస్థలాల లే ఔట్లలో పురోగతి విషయమై మండలవారీగా వారాంతపు పురోగతిపై కూలంకుషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ అంతర్గత , భూమి మెరక పనులు అప్రోచ్ రోడ్లు, త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల జియో ట్యాగింగ్, ఇళ్ల నిర్మాణాలకు పునాదులు వేయడం, మ్యాపింగ్ వంటి వాటిని ఈడబ్ల్యూఎస్ లాగిన్లో పొందుపరచాలని, రాళ్లను ఏర్పాటు చేసి వాటికి నంబరింగ్ ఇచ్చి లబ్ధిదారునికి తన స్ధలాన్ని నేరుగా వెళ్లి చూసుకొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షాలు కురవడంతో ఆయా ఇళ్లస్థలాలలో నీళ్లు నిలిచిపోవడజతో మెరక పనులు సరిగా జరగడం లేదని పలువురు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. అత్యధికశాతం మంది లబ్ధిదారులు ఇప్పుడు శంఖుస్థాపనలు చేయమని చెబుతున్నారని శ్రావణమాసంలో ఒక మంచి రోజున ఆ పనులు లు చేస్తామని చెబుతున్నారని మరో అధికారి తెలిపారు. ఉంగుటూరు మండలంలో పరిస్థితిని కలెక్టర్ సమీక్షిస్తున్నప్పుడు ఒక అధికారిణి జవాబు ఇస్తూ చెరువుల్లో మట్టిని తరలించేందుకు మైనింగ్ శాఖ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని ఇట్లస్థలాల మెరక పనులకు తోలుకోవాలంటే మైనింగ్ శాఖ అనుమతి అవసరం లేదని ఆ విషయం మీరు తొలుత గ్రహించాలని కలెక్టర్ అన్నారు. కోర్టు కేసులు జిల్లాలో 34 ఉన్నాయని దీని వలన 8 వేల ఇళ్ళు పెండింగ్ లో ఉన్నట్లు ఆయా న్యాయపరమైన ఇబ్బందులు తొలిగేలా ఆర్డీవో స్థాయి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సూచించారు. సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ హోసింగ్ శ్రీనివాస నుపుర్ అజయ్ కుమార్ , హోసింగ్ పి డి రామచంద్రం, డ్వామా పీడీ సూర్యనారాయణ, మచిలీపట్నం ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, తహసీల్దార్లు, ఏ పి ఓలు హోసింగ్ డి ఇ లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *