-భారత్ మారిటైమ్ రంగ అభివృద్ధి కోసం తీరప్రాంత రాష్ట్రాలను ఏకం చేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..
-నరేంద్ర మోదీ నాయకత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, మారిటైమ్ రంగంలో వృద్ధితో భారత్ గ్లోబల్ మారిటైమ్ పవర్ హౌస్ గా రూపాంతరం చెందనుంది.
-స్వర్ణ ఆంధ్ర @ 2047 ద్వారా భారత్ మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..
-చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీ మారిటైమ్ రంగం అభివృద్ధికి అనేక కీలకమైన చర్యలు చేపట్టాం..
-రూ. 17 వేల కోట్లతో రామయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్ వే మరియు మాలపేట వద్ద 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం..
-మారిటైమ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్మికుల అవసరం అత్యంత కీలకం
-రామయపట్నం పోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాం..
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం యొక్క వికసిత్ భారత్ – 2047 కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో.. “స్వర్ణ ఆంధ్ర @ 2047 ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు పెంచడంతో పాటు, భారత్ మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన 4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశంలో కేంద్ర రోడ్లు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర సహాయ శాఖ మంత్రి శంతను ఠాకూర్, తీర ప్రాంతాల రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొనడం జరిగింది..
సుధీర్ఘ తీర ప్రాంతం గల భారత్ లో మారిటైమ్ రంగ అభివృద్ధి, పోర్టుల అనుసంధానం, ఆధునికీకరణ, బ్లూ ఎకానమీకి ప్రోత్సాహాం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సాగర్ మాల అపెక్స్ కమిటీ చర్చించడం జరిగింది. 4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశానికి హాజరైన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ కార్యదర్శి టీ. కె. రామచంద్రన్ స్వాగతం పలకడం జరిగింది..
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ సాగర్ మాల అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేదికను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి వర్యులు సర్బానంద సోనోవాల్ కు ధన్యవాదాలు మంత్రి తెలిపారు.. భారత మారిటైం రంగ పురోగతి కోసం తీర ప్రాంత రాష్ట్రాలను ఏకం చేయడంలో ఆయన చూపిన చొరవకు అభినందనలు తెలిపారు…గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరియు మారిటైమ్ రంగంలో చూపిన వృద్ధి కారణంగా భారత్ గ్లోబల్ మారిటైమ్ పవర్ హౌస్ గా రూపాంతరం చెందిందన్నారు..
కేంద్ర ప్రభుత్వం యొక్క వికసిత్ భారత్ – 2047 కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో.. “స్వర్ణ ఆంధ్ర @ 2047 ఆవిష్కరణ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గా మారడంతో పాటు, భారత్ మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీ మారిటైమ్ రంగం అభివృద్ధికి అనేక కీలకమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.. రాష్ట్రంలోని రామయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్ వే మరియు మూలపేట వద్ద 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను రూ. 17 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.. దీంతో పాటు రూ. 3,520 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు..
మారిటైమ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్మికుల అవసరం అత్యంత కీలకమని తెలిపారు.. రామయపట్నం పోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి పోర్టుల, షిప్పింగ్ & వాటర్‌వే మంత్రిత్వ శాఖ (MoPSW) నుండి సాంకేతిక అనుమతిని పొందడం జరిగిందన్నారు.. ఆఫరేషనల్ పోర్టులకు అనుసంధానంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగిందని, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నామన్నారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర మారిటైమ్ జల మార్గాల మాస్టర్ ప్లాన్ (SMWMP) తయారు చేస్తోందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డు (APMB) అనేక ప్రాజెక్టులను గుర్తించి సాగర్ మాల ప్రోగ్రామ్ యొక్క 5 ప్రధాన ఫిల్లర్ల ను అమలు చేయడానికి నిర్ణయించిందన్నారు.. సాగర్ మాల ప్రణాళిక కింద ఆర్ధిక సాయం కోసం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వినతులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నామన్నారు…
బాపట్ల జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు మరియు నౌకా తయారీ కేంద్రం స్థాపనకు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలంలోని మోటుపల్లి – పెద గంజాం గ్రామాల మధ్య తీర ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు మరియు నౌకా తయారీ కేంద్రం స్థాపించాలని కోరుతూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వినతిపత్రం అందించడం జరిగింది.. గ్రీన్ ఫీల్డ్ పోర్టు & నౌకా తయారీ కేంద్రం స్థాపనతో ఈ ప్రాంత అభివృద్ధితో పాటు, స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీసుకురావడం జరిగింది..
గోవా సీఎంతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి భేటీ
4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశానికి ముందు పలువురు జాతీయ స్థాయి నేతలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కలవడం జరిగింది.. ముఖ్యంగా గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కర్నాటక పోర్టుల శాఖ మంత్రి ఎం ఎస్ వైద్యతో మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో పోర్టుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వారితో చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడులు & మౌలిక సదుపాయాలు కార్యదర్శి యువరాజ్, ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, మారిటైం బోర్డ్ సీఈవో ప్రవీణ్ ఆదిత్యలు హాజరు కావడం జరిగింది.
Prajavartha Online Telugu News