కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు డివిజన్ కార్యాలయంలో ప్రజల నుంచి ఐదు ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుంచి ఆర్డీవో స్పందన ఫిర్యాదు లను స్వీకరించారు. ఈ సందర్భంగా డి.లక్ష్మారెడ్డి వివరాలు తెలుపుతూ, పట్టాదారు పాసు పుస్తకం వివరాలు మార్పు ఆన్లైన్ లో కూడా చెయ్యాలని సీహేచ్ వెంకటలక్ష్మి, వారసులకు ఆస్తుల అప్పగింత కై ఎన్. సత్యనారాయణ, భూమి రీసర్వే చేసి అప్పగించాలని జి.పార్ధ సారధి, భూమి కొలతలు చేసి రిపోర్ట్ ఇవ్వాలని జి. సత్యనారాయణ, ధాన్యం కొనుగోలు విషయమై ఐ కె పి ధరను చెల్లింపు చేయాలని వి.శ్రీను లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన తహసీల్దార్, సీఐ, ఐకెపి, ఆర్డీవో సెక్షన్ సిబ్బందికి కు సిఫార్సు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై గ్రామ సచివాలయం స్థాయి లోనే స్వీకరించి పరిష్కరించడం జరుగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ మార్గదర్శకాల మేరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరింస్తున్నామన్నారు. స్థానికంగా ప్రజల సమస్యలను గ్రామ/వార్డు వాలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాల నుంచి వివరాలు సేకరించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని స్పష్టం చేశారు. ఆర్డీవో కార్యాలయం ఏ ఓ జవహర్ బాబాజీ రావు, , ఇతర అధికారులు స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …