-ఐవీఆర్ ఎస్ సర్వే నివేదికలిస్తున్నాం
-ఎక్కడెక్కడ వనెకబడ్డామో తెలుసుకుని అక్కడ పరిస్థితులు మెరుగయ్యేలా చేయాలి
-కలెక్టర్లకు సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా సూచన
-పీపుల్స్ పెర్‌సెప్షన్స్‌పై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై ప్రజల్లో మరింత సంతృప్తి స్థాయి పెంచేలా జిల్లాల్లో యంత్రాంగం పనిచేయాలని ఆ దిశగా జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా అన్నారు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పీపుల్స్ పెర్సెప్షన్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లాంటి అంశాల్లో ఇంకా సంతృప్తి పెరగాల్సిన అవసరముందన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ గతంలోకంటే ప్రస్తుతం మెరుగైందని, అయితే అది మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. ఆర్టీసీ సేవలు, ఇసుక లభ్యత, శాంతి భద్రతలు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ తదితర అంశాలపై ఐవీఆర్ ఎస్ సర్వే ద్వారా సేకరించిన ప్రజా సంతృప్తి స్థాయిపైన ఆయన ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా కలెక్టర్లందరికీ ఏఏ ప్రాంతంలో ఆయా కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగలేదు, ఎక్కడ ఇంకా మెరుగు పడాల్సి ఉందనే వివరాలు అందజేస్తున్నామని, జిల్లా కలెక్టర్లు ఆయా కార్యక్రమాల అమలులో ఎక్కడ వెనుకబడి ఉన్నామో మదింపు వేసుకుని వాటిని మెరుగుపరచడానికి కృషి చేయాలని కోరారు.