-తాగునీరు, డ్రైనేజీ సమస్యను పరిష్కారించండి
-నగర పర్యటనలో అధికారులకు మంత్రి వెలంపల్లి అదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు నాయుడు ప్రక్క రాష్ట్రంలో ఉండి, ప్రజలను తప్పదోవ పట్టించే విధంగా నిరసనలు చేయడం వారికే చెల్లిందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం పర్యటనలో 41వ డివిజన్ మసీదు రోడ్డు , హరిజనవాడ, దర్గా, ఆశ్రమం రోడ్డు పి.ఆర్.కె.బిల్డింగు రోడ్డు, సభాపతి రోడ్డు మీదుగా స్వాతి సెంటరు తదితర ప్రాంతాలను మంత్రి అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో తాగునీరు, డ్రైనేజి పారుదలకు చర్యలు చేపట్టాలని అధికారులకు అదేశించారు. అదే విధంగా సాంకేతిక ఇబ్బందుల కారణంగా నిలిచిన ఫించన్, అమ్మబడి లబ్దిదారులకు వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని సచివాలయం సిబ్బందికి అదేశాలు ఇచ్చారు. మ్యానిఫెస్టో చెప్పిన విధంగా 95 శాతం హామీలను అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వంది అన్నారు. చంద్రబాబు తన వెబ్‌సైట్ నుంచి మ్యానిఫెస్టో తొలగించిన ఘనత వారిది అన్నారు. కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ ఎం.డి ఇర్పాన్, వైసిసి శ్రేణులు ఉన్నారు.