Breaking News

అంగరంగ వైభవంగా, ఘనంగా రాష్ట్ర స్థాయి ఉగాది సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు హజరయ్యారు. ముందుగా విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జ్యోతిని వెలిగించి సీఎం చంద్రబాబు ఉగాది సంబరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా షడ్రుచుల సమ్మెళనమైన ఉగాది పచ్చడిని నిర్వాహకులు అతిధులకు అందచేశారు. అనంతరం పండితులు, శతావధాని మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం చేశారు. తదుపరి సీఎం చేతుల మీదుగా టీటీడీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల విశ్వావసు నామ సంవత్సర పంచాగాలను విడుదల చేశారు. అలాగే సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల కేలండర్ ను సీఎం ఆవిష్కరించారు. ఇక చివరగా సాహిత్యం, కళలు, జర్నలిజం, హాస్యావధానం, బాల సాహిత్యం, పద్యం, సాంస్కృతిక సేవలు, మిమిక్రీ, బుర్రకథ, హరికథ, నాటకం, సామాజిక సేవ, సినిమా ఇలా అనేక రంగాల్లో సేవలందించిన ప్రముఖులు 202 మందికి ఈ అవార్డులను ప్రకటించగా వీరిలో 86 మందికి కళారత్న(హంస), 116 మందికి ఉగాది పురష్కారాలు ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సింగపూర్ ప్రతినిధుల బృందంతో సమావేశమైన సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మాదిరి గానే సింగపూర్ ప్రభుత్వం ఎపి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *