-పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వా వసు నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సూర్యారావుపేటలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేశారు. మార్తి శివరామకృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేసిన ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో అంకితభావంతో పనిచేసిన విశిష్ట వ్యక్తులకు ఉగాది పురస్కారాలు అందజేశారు.
ప్రజలందరూ ఆర్థిక ప్రగతి సాధించాలి
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించిన పశ్చిమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలను అందిస్తానన్నారు ప్రజలందరూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆరోగ్యంగా ఉండాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి, 20 సూత్రాల చైర్మన్ దినకర్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ, ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ,అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ, మువ్వల సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.