Breaking News

శివగంగ ప్రాంతంలో పైప్ లైన్ పనులకు మంత్రి శంఖుస్థాపన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధులుగా తమ ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. బుధవారం ఆయన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30 వ డివిజన్ శివగంగ ప్రాంతంలో 7 లక్షల రూపాయల వ్యయంతో 550 మీటర్ల పైప్ లైన్ పనులను శంఖుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందిని తన దృష్టికి తీసుకొచ్చిన కార్పొరేటర్ మిరియాల నాగ బసవ పూర్ణిమ, డివిజన్ ఇంచార్జ్ మిరియాల రాంబాబు ఈ వసతి ఒనగూర్చడానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పైప్ లైన్ శంఖుస్థాపన కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు తంటిపూడి కవిత, లంకా సూరిబాబు మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాభా) 13 వ డివిజన్ ఇంచార్జి బందెల థామస్ నోబుల్, ఎం ఇ త్రినాధ్ రావు, ఏ ఇ వర ప్రసాద్, పిల్లి ప్రసాద్ , పరమాత్మ బాగ్స్ వర్క్స్ రమేష్, పళ్లెం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 947

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *