-జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులకు పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేస్తున్నాం… ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన P4 కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న 20 శాతం మంది బడుగు బలహీనర్గాల పేదల జీవన ప్రమాణాల మెరుగుకు చర్యలు చేపడుతున్నాం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-మన కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది: ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు
-బాబూ జగ్జీవన్ రామ్ సమతావాది: నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్ రామ్ జీవితం చిరస్మరణీయం, ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ అన్నారు.
శనివారం ఉదయం స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలోని బైరాగి పట్టెడ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగ్జీవన్ రామ్ పార్క్ లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మాజీ మంత్రి పరశరత్నం తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మీడియా తో మాట్లాడారు. అనంతరం బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం ఆదర్శనీయమని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలనే ఆదేశాలను అనుసరించి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఘనంగా నిర్వహించు కుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అసోసియేషన్ వారు, పలు సంఘాల వారు, అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, సంక్షేమ హాస్టళ్లు తదితరాల్లో వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి, బాబూ జగ్జీవన్ రామ్ గారి సేవలను స్మరించుకోవడం జరుగుతోందని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్యం సిద్ధించడానికి అలాగే స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి అని ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అని తెలిపారు. చాలా చిన్న వయస్సులోనే రాజకీయాల పట్ల ఆకర్శితులై రాజకీయాల ద్వారానే ప్రజలకు మంచి చేయగలమని నమ్మి ఎక్కడో బీహార్ లోని మారుమూల ప్రదేశం నుండి వచ్చి తన రాజకీయ జీవితంలో ఎంఎల్ఏ , ఎంఎల్సి , మంత్రి , మరియు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా, ఉప ప్రధాని గా వివిధ హోదాలలో 32 ఏళ్ల పాటు పనిచేసి నేడు మనందరి మనసులలో నిలిచిపోయారని అన్నారు. పలు శాఖలకు మంత్రిగా పని చేసిన ఆయన కార్మిక శాఖ మంత్రిగా పని చేసినప్పుడు కార్మికులకు వేతనాలు, భద్రత తదితర వాటిపై పలు సంస్కరణలు తీసుకుని వచ్చారని, అవి ఇప్పటికీ అమలులో ఉన్నాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, బలహీన వర్గాలకు చెందిన వారి కోసం సివిల్ ప్రొటెక్షన్ రైట్ యాక్ట్ ను తీసుకుని వచ్చారని వారి సేవలు ఆదర్శనీయమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం తన వంతు పాత్ర పోషించారని అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ వంటి మహోన్నత వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని యువత తమ జీవితంలో ముందుకు వెళ్ళాని ఆకాంక్షించారు. మీడియాతో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. సిఎం గారు మరీ ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్ల లో వసతుల కల్పనపై ప్రతేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారని, ఆ దిశలో మన జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలలలో ఉన్న మరమ్మత్తులు, పునరుజ్జీవన పనులు పెద్ద ఎత్తున 25 కోట్ల సిఎస్ఆర్ నిధులతో మరియు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టడం జరుగుతోందని తెలిపారు. గౌ. ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన P4 విధానం మేరకు పేదరికంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి అట్టడుగు 20 శాతం మందికి టాప్ లో ఉన్న పది శాతం మందితో అనుసంధానం చేసి వారి జీవన ప్రమాణాలను పెంచే కార్యక్రమానికి ఈ మధ్యనే శ్రీకారం చుట్టారు అని, ఆ మేరకు జిల్లాలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మన జిల్లాలో అట్టడుగు 20 శాతం మంది పేదలను, టాప్ పది శాతం వారిని గుర్తించడం జరిగిందని, త్వరలో అనుసంధానించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా ఘనంగా చేపట్టి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. ప్రజా నాయకుడు సంఘసంస్కర్త ప్రజా సేవకుడు మాజీ ఉప ప్రధాని గా ప్రజలకు సేవ అందించారని కొనియాడారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అబివృద్దికి అనేక సంస్కరణలు చేశారని, స్వాతంత్ర ఉద్యమానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. అలాగే ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుతో 20187 కోట్లు రూపాయలను ప్రస్తుత బడ్జెట్ నందు కేటాయించడం జరిగిందనీ, ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ, అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదలను అభివృద్ధి పథంలో తీసుకురావాలని సదుద్దేశంతో సిఎం పి4 విధానాన్ని అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తీసుకురావడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలోనే ఎన్నో పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టం ఏర్పడినపుడు బాబూ జాగ్జీవన్ రామ్ ఎంతో ప్రముఖ పాత్ర వహించారని, ముఖ్యంగా ఇండో పాక్ యుద్ధం 1971 జరిగినప్పుడు కీలక స్థానంలో ఉన్నారని, అగ్రికల్చర్ మంత్రిగా గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారకులయ్యారు అని పేర్కొన్నారు. సమాన హక్కుల పోరాటానికి కృషి చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరశ రత్నం, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ బాబూ జాగ్జీవన్ రామ్ గారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, పలువురు సంఘ నాయకులు, సంక్షేమ శాఖ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News