విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ సచివాలయాన్ని గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ మేర చేరువ చేస్తున్నది సచివాయంలోని సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ క్యాలండర్, ఇతర అంశాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించింది లేనిది ఆయన పరిశీలించారు. ప్రతి రోజు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరుగైన సేవలందించాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు కోవిడ్ నివారణ సూచనలు, వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన పరచాలన్నారు. గ్రామంలో పెన్షన్లు, రేషన్ పంపిణీ తీరును సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. ప్రతి వారం సోమ,మంగళ, బుధవారంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల గురించి
ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టార్లను ఆయన పరిశీలించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత సిబ్బందితో సమీక్షించారు. ప్రజలకు సేవలందించడంలో ఏ ఒక్కరూ కూడా జాప్యం , నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సక్రమంగ వెబ్ సైట్ నందు నమోదు చేస్తున్నది లేనిది ఆయన వాకబు చేశారు. ఇందుకు సంబంధించి పలు విషయాలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
ఫీవర్ సర్వే పరిశీలించిన సబ్ కలెక్టర్
గొల్లపూడి గ్రామంలో జరుగుతున్న ఫీవర్ సర్వేను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరిశీలించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది వచ్చి సర్వే చేస్తున్నరా లేదా అనే విషయాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా ప్రజలనుండి వివరాలను ఆయన సేకరించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఖచ్చితంగా ఫీవర్ సర్వే పటిష్ఠంగా నిర్వహించాలన్నారు. వీరి వెంట రూరల్ తహాశీల్దార్ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.