Breaking News

నన్ను ధరించండి… మీకు పునర్జన్మను ఇస్తాను… ఐ ఎస్ ఐ మార్క్ హెల్మెట్…

-హెల్మెట్ ల విక్రయాలపై నిఘా పెట్టండి…
-ఐఎస్ఐ 4151-2015 మార్కు కలిగిన హెల్మెట్ మాత్రమే ధరించాలి…
-జిల్లా కలెక్టరు జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ద్విచక్ర వాహనాలు నడిపే వాహనచోదకులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఐఎస్ఐ 4151-2015 మార్కు కలిగిన హెల్మెట్ లను మాత్రమే ధరించాలని, నాసిరకం హెల్మెట్లను ధరించవద్దని జిల్లా కలెక్టర్ జె.నివాస్ మోటార్ సైకిల్ చోదకులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నన్ను ధరించు మీకు పునర్జన్మను ఇస్తాను అనే నినాదంతో రూపొందించిన గోడ పత్రిని జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్, డిటిసి యం పురేంద్ర లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ మాట్లాడుతూ ద్విచక్రవాహనాలు నడిపే వాహనచోదకులు నాసిరకం హెల్మెట్ ధరించడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే సమయంలో హెల్మెట్ పగిలిపోయి ప్రమాద తీవ్రతను పెంచుతుందన్నారు. అకాల మృత్యువాత పడడం, కోమాలోకి వెళ్లడానికి అస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతామన్నారు. దానివలన ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది ఆయన తెలిపారు. తక్కువ రేట్లకు దోరుకుతుందని రోడ్లపక్కన అమ్మే నాసిరకం హెల్మెట్ ను కొనుగోలు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. నాసిరకం హెల్మెట్ అమ్మిన, ధరించిన కూడా నేరమేనని ఆయన అన్నారు. రోడ్డు పక్కల హెల్మెట్లను విక్రయించే షాపులపై పోలీస్ విజిలెన్స్, రవాణాశాఖ అధికారులతో సంయుక్తంగా దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వాహనాలు విక్రయించే షోరూమ్ లలో కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి నాసిరకం హెల్మెట్లు విక్రయాలు జరిపై షోరూమ్ లపై కూడా కేసులు నమోదు చేయాలని డిటీసీ పురేంద్ర కు కలెక్టర్ సూచించారు.

డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు నడిపే వారిని తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. నాసిరకం హెల్మెట్ పెట్టుకున్నా కూడా హెల్మెట్ ధరించలేనట్టుగానే భావించి కేసులు నమోదు చేస్తామన్నారు. ఐఎస్ఐ 4151-2015 ప్రమాణాలు కలిగిన హెల్మెట్లు మాత్రమే ధరించాలని ఆయన కోరారు. తక్కువ ధరకు వచ్చి నాసిరకం హెల్మెట్లను కొనుగోలు చెయ్యవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వీడు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు వాసు, రవాణాశాఖ , తదితర శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *