-సమిష్టి తత్వంతో ప్రణాళికలు తయారు చెయ్యాలి… డివిజినల్ పంచాయతీ అధికారి భమిడి శివ మూర్తి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగిన సర్పంచులు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టవల్సి ఉందని డివిజినల్ పంచాయతీ అధికారి మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కొవ్వూరు అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాల లో కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాలకు నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణా కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా కొవ్వూరు డివిజనల్ పంచాయతీ అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులనుద్దేశించి మూర్తి ప్రసంగిస్తూ శిక్షణ లో బోధించే అంశాలు మెలుకవలు శ్రద్ధ గా నేర్చుకుని గ్రామాల్లో సర్పంచులుగా విధి నిర్వహణలో చిత్తశుద్ధి తో పనిచేసి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాలో శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా ఇవ్వాలని తెలిపారు. జగనన్న స్వచ్చ సంకల్పం ఆగష్టు 20 వతేదిన ప్రారంభం కానున్న సందర్భంగా అన్ని మండల కేంద్రాలలో 9 వతేదిన సమాయత్త సమావేశాలు నిర్వహించుట జరుగునని తెలిపారు. సర్పంచులు అందరూ అందుకు సమాయత్తం కావాలని ఆయన తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నియంత్రణ అధికారాలు, ఆర్థిక పరిపుష్టి, గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలు, పౌర సేవలు, సంక్షేమ పధకాలు పై రెండవరోజు శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఓ.టీ.లు ఎ.వి.సుబ్బరాయన్, U రాజారావు, డి. చంద్రశేఖర్, ఈఓఆర్డీ కె.మెస్సయ్యరాజు, డి.పి.ఆర్.సి. డివిజనల్ కో ఆర్డినేటర్ ఎ. నాగరాజు, ఎఫ్.టి.సి. ఎన్. రామకృష్ణ , సర్పంచులు పాల్గొన్నారు