-4శాతం రిజర్వేషన్లో మైనార్టీ విద్యార్ధులకు ఎంతో మేలు…
-మైనార్టీ ఫైనాన్స్ కార్పో రేషన్ ఛైర్మన్ షేక్ అసీఫ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 11 కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను మైనార్టీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన రెడ్డి కే దక్కుతుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ అసీఫ్ చెప్పారు. స్థానిక లబ్బీ పేటలోని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కార్యాలయంలో శుక్రవారం తన చాంబరులో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ తనను ఈకార్పోరేషన్ కు ఛైర్మన్ గా నియమించడమే వారు మైనార్టీ లకు పెద్దపీట కల్పిస్తున్నారన్న దానికి నిదర్శనం అన్నారు. తనకు ఎంతో అండగా ఉన్న రాష్ట్రమంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, తదితరులకు అసీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ కల్పించిన 4 శాతం రిజర్వేషన్ తో ఎంతోమంది మైనార్టీ విద్యార్ధులు డాక్టర్, ఇంజినీర్ కోర్స్ లు చదివి ఎంతో ఎదిగారన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సియం జగన్మోహన రెడ్డి మైనార్టీల సంక్షేమానికి ఎ న్నో మేలైన కార్యక్రమాలు చేపట్టారన్నారు. మైనార్టీలకు గత ఆర్ధిక సంవత్సరంలో వాహనమిత్ర
క్రింద 25 వేల 517 మందికి 25 కోట్లు, జగనన్న అమ్మఒడి క్రింద 2,90,282 మందికి 435 కోట్లు, జగనన్న వసతి క్రింద 69,356 మందికి 67 కోట్లు అందించారన్నారు. 2020-21లో ఇంతవరకూ జగనన్న అమ్మఒడి క్రింద 48,202 మందికి రూ. 67.48 కోట్లు, జగనన్న వసతి దీవెనె క్రింద 60,141 మందికి రూ. 64.83 కోట్లు, జగనన్న విద్యాదీ వెనె క్రింద 65,990 మందికి రూ. 78.43 కోట్లు, జగనన్న చేదోడు క్రింద 18331 మందికి రూ. 18.33 కోట్లు అందించారన్నారు. తొలుత కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ అసీఫ్ కు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ యండి యస్. అలీం భాషా, పలువురు ముస్లిం నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు.