జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట పట్టణంలో 100 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ నందు విధులు నిర్వహించిన డాక్టర్లు, నర్సులు, కోవిడ్ కేర్ సెంటర్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మరియు కోవిడ్ కేర్ సెంటర్ కు ఆర్థికసహాయం అందజేసిన దాతలకు సామినేని విమలాభాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు, సామినేని విమలాభాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలాభాను గారు పాల్గొని కోవిడ్ కేర్ సెంటర్ నందు విశేష సేవలు అందజేసిన డాక్టర్లు, నర్సులు, కోవిడ్ కేర్ సెంటర్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మరియు కోవిడ్ కేర్ సెంటర్ కు ఆర్థికసహాయం అందజేసిన దాతలకు శాలువా, మెమెంటో లతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్ లో విధులు నిర్వహించిన వైద్య సిబ్బంది, నర్సులు, ప్రభుత్వ అధికారులు, దాతలు ప్రతిఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సామినేని విమలాభాను ఫౌండేషన్ ద్వారా కోవిడ్ కేర్ సెంటర్ కు రూ. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన విషయాన్ని అయన గుర్తు చేశారు.
Tags jaggaiahpeta
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …