మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో వివిద మీడియా సంస్థలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు చెందిన 545 మందికి మీడియా ఎక్రిడిటేషన్లు జారీ చేయుటకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా ఎక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ శ్రీ జె. నివాస్ గురువారం ఫైలుపై సంతకం చేశారని జిల్లా సమాచారశాఖ ఉప సంచాలకులు శ్రీ మహబూబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా మీడియా ఎక్రిడిటేషన్ కమిటీ సమావేశం గురువారం కలక్టర్ అధ్యక్షతన విజయవాడలో జరిగిందని తెలిపారు. వివిద మీడియా సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులు ఆన్ లైన్ లో సమాచార శాఖ వైబ్ సైట్లో దరఖాస్తు చేసుకున్నారని, ప్రభుత్వం మీడియా ఎక్రిడేషన్ నిబంధనలు జారీ చేసిన జి.వో నెం. 142 ప్రకారం అర్హత కలిగిన మీడియా సంస్థలు వాటిలో పని చేస్తున్న మీడియా ప్రతినిధులు నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు అప్లోడ్ చేసుకున్న 545 మందికి మీడియా ఎక్రిడిటేషన్లు జారీ చేయాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. మీడియా ఎక్రిడేషన్ల జారీ నిరంతర ప్రక్రియ, ఇప్పుడు ఎక్రిడేషన్లు రానివారు అసంతృప్తికి గురికావలసిన అవసరం లేదని కేవలం అవసరమైనవి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయని కారణంగా కొన్ని పెద్ద పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులకు కూడా ఎక్రిడేషన్లు ఆగాయని, అవసరమైన డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసుకున్న వారికి వెంటనే మీడియా ఎక్రిడేషన్లు జారీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ విషయాలు మీడియా ప్రతినిధులు గమనించాలని, పరిస్థితిని అర్ధం చేసుకోవాలని మీడియా సంస్థల అర్హతల మేరకు పూర్తి స్థాయిలో మీడియా ఎక్రిడేషన్లు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన తెలిపారు.
Tags machilipatnam
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …