అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయడం ఎంతో అభినందనీయమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి టోక్యో కాంస్య పథక విజేత పి.వి.సిందు అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని మర్యాధపూర్వకంగా కలిసిన అనంతరం పాత్రికేయులతో ఆమె కొంత సేపు ముచ్చటించారు. టోక్యో ఒలంపిక్స్ కి వెళ్లే ముందు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసానని, ఒలంపిక్స్ లో పథకాన్ని సాదించిరావాలని ప్రోత్సహించారన్నారు. వారి ప్రోత్సహించినట్లే టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పథకాన్ని సాదించినందుకు ముఖ్యమంత్రి తనను ఎంతోగానో అభినందించారని, భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాదించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ ను అమలు పరుస్తున్నారని, ఇటు వంటి విధానం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పురస్కారాలను అందజేయడం కూడా ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు. పాత్రికేయులు అడిగి ప్రశ్నకు ఆమె సమాదానం చెపుతూ త్వరలోనే క్రీడా అకాడమీని కూడా ప్రారంభించనట్లు ఆమె తెలిపారు. సాంస్కృతిక ,యువజన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …