విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత బి.సి, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ లపై కొంతమంది పోలీసువారి అధికారాన్ని చేతిలోకి తీసుకుని చేయని నేరాలకి అక్రమ కేసులు నమోదు చేయడమేకాక వారిని కొట్టి దారుణంగా హింసించి ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. ముక్యంగా నంద్యాలలో చేయని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని బలితీసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వములోని పోలీసులు, అది మరువకముందే ఇప్పుడు గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పక్కరాష్ట్రం నుంచి మద్యం తరలిస్తున్నారనే నెపంతో అలీషాని కొట్టి చంపేసిన పోలీసుల కర్కశాన్ని ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాను. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకుల మెప్పుపొందడానికి కావాలని తప్పుడుకేసులు బనాయించి జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని దీనిపై రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి తక్షణమే సంబంధిత అధికారులను ఉద్యోగాల నుంచి తొలిగించాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిందితులకు తగిన శిక్ష పడే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, చనిపోయిన వారి కుటుంబానికి 50లక్షల పరిహారం ప్రకటిచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, సిటీ మహిళా అధ్యక్షురాలు దామర్ల సాంబ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …