విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్ట కాలం లో నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకొని ఆ వైద్య ఖర్చులు కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కి ఆర్జి పెట్టుకొన్నారో వారందరికి చెక్కులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గుణదల వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు మంజూరు అయిన 14 మందికి దాదాపు మూడు లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ నమ్మకం తో అయితే పేద ప్రజలు మా ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారో వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా జగన్ పరిపాలన అందిస్తున్నారని, కరోనా సంక్షోభ సమయంలో కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న సరే ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తు నేరుగా ఇంటికే సంక్షేమ ఫలాలు చేరుస్తున్నారని కొనియాడారు. ఈ రెండేళ్ల కాలంలోనే ఒక్క తూర్పు నియోజకవర్గనీకె దాదాపు కోటి రూపాయల పైగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేశారని,అర్హులైన మిగతవారికి కూడా చెక్కులు రాగానే అందజేస్తామని తెలిపారు. గతంలో ఈ ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎవరైనా ఆర్జి పెట్టుకోవాలి అంటే టీడీపీ నాయకులకు లంచాలు ఇచ్చే పరిస్థితి అని కానీ నేడు వైసీపీ ప్రభుత్వం లో ప్రతి పధకం అర్హత ప్రాతిపదికన పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ఎవరైనా ముఖ్యమంత్రి సహాయనిధి పెట్టుకోవాలి అంటే మా కార్యాలయంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో నాగవంశ డైరెక్టర్ ఎన్నింటి సుజాత, కార్పొరేటర్లు నిర్మలా కుమారి,ప్రవాళ్ళిక,అంబేద్కర్,మాధురి,రామిరెడ్డి,పుప్పాల కుమారి, వైసీపీ నాయకులు చిమాటా బుజ్జి, చిన్నబాబు, రమణారెడ్డి, బచ్చు మురళి, రాజ్ కమల్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …