Breaking News

సర్పంచుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశము…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాల లో కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాలకు నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశమునకు ముఖ్య అతిధిగా కొవ్వూరు డివిజనల్ పంచాయతీ అధికారి  భమిడి శివమూర్తి, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి.జగదాంబ  హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులనుద్దేశించి ప్రసంగిస్తూ సర్పంచులు విధి నిర్వహణలో చిత్తశుద్ధి తో పనిచేసి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాలో శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని, జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం విజయవంతం చేయడానికి సర్పంచులు అందరూ సమాయత్తం కావాలని వారు తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో పారదర్శక పరిపాలన, గ్రామ పంచాయతీ పనితీరు, రికార్డు ల నిర్వహణ, జవాబుదారీతనం మరియు క్రమ శిక్షణ మొదలగు అంశాల పై మూడవరోజు శిక్షణ కల్పించారు. శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకొన్న సర్పంచులకు ధృవపత్రాలు అందించారు. శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకొన్న సర్పంచ్ లు మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగపడినదని, గ్రామ పరిపాలనకు సంబంధించి చాలా విషయాలు నేర్చుకొనుట జరిగినదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.ఓ.టీ.లు ఎ.వి.సుబ్బరాయన్, U రాజారావు, డి. చంద్రశేఖర్, ఈఓఆర్డీ కె.మెస్సయ్యరాజు, డి.పి.ఆర్.సి. డివిజనల్ కో ఆర్డినేటర్ ఎ. నాగరాజు, ఎఫ్.టి.సి. ఎన్. రామకృష్ణ , సర్పంచులు పాల్గొన్నారు

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *