Breaking News

వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు సియం చేతుల మీదగా ఈనెల 13న అవార్డుల ప్రదానోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ఈ నెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణా మోహన్ చెప్పారు.
స్థానిక లబ్బిపేటలోని ఏవన్ కన్వెన్షన్ హాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును శనివారం టూరిజం సిఇఓ విజయ కృష్ణన్, జిల్లా కలెక్టర్ జె. నివాస్, వియంసి కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్, డిఆర్‌ఓ యం. వెంకటేశ్వర్లులతో కలిసి ప్రభుత్వ సలహాదారు కృష్ణ మోహన్ పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. అవార్డుల పురస్కార కార్యక్రమం కు సంబంధించి వేదిక ఏర్పాట్లు ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు, పురస్కార గ్రహితులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు పై వారు చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణా మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు రూ. 10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుకు రూ. 5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించడం జరుగుతుందని అన్నారు. 6 కేటగిరీల పురస్కారాలు ప్రధానం చేయనున్నారని తెలిపారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *