-రూ.1 కోటి 90 లక్షలు ఆర్ధిక ప్రయోజనం…
-ఆగస్ట్ 10 న ముఖ్యమంత్రిచే లబ్ధిదారుల ఖాతాకు చేయూత సొమ్ము…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం’ పథకంతో చేనేత కార్మికుల ప్రతి ఏటా రూ.24 వేలు ఆర్ధిక చేయూత నిచ్చి ప్రోత్సహించడం జరుగుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి వరుసగా రెండో ఏడాది కూడా 2021-22 ఆర్ధిక సంవత్సరం లో పశ్చిమగోదావరి జిల్లా లోని 792 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున రూ.1,90,08,000 లను ఆర్ధిక ప్రయోజనం ఈ నెల 10న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాలోకి జమచేయ్యనున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2020-21) లో జిల్లాలో 1119 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.24 వేలు చొప్పున జిల్లాలో నేతన్న ల బ్యాంకు ఖాతాలకు రూ.2,68,56,000 ల మొత్తాన్ని నేరుగా జమ చేసి ఆదుకోవడం జరిగింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేతన్నలను ఘనంగా సన్మానించడం జరిగింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకుని రావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తున్నారు. నేతన్న నేడు నేతను తన జీవన ఆదాయ వనరుగా విధానం గా మలుచుకొవడం చేనేత వృత్తి జీవనాధారం కల కుటుంబాలు గౌరవప్రధంగా నిలబడే ప్రయత్నంలో ప్రభుత్వం నేతన్న నేస్తం అమలు చేయడం పట్ల సానుకూల స్పందన వొస్తోంది. దేశ చరిత్రను ఒక్కసారి స్ఫురణకు వొస్తే స్వాతంత్ర్య సమరంలో చేనేత వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది అనడంలో సందేహం లేదు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి నేపథ్యం… మా బట్టలు మేమే తయారు చేసుకుంటాం.. మా సంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరిస్తాం అని బ్రిటిష్ పాలకులకు మహాత్మాగాంధీ ఎలుగెత్తి చాటిన చరిత్ర చేనేతది అనడం అతిశయోక్తి కాదు. చేనేత వస్త్రాలకు బ్రాండ్ క్రియేట్ చేసేలా యువత / ప్రజలు/ ముఖ్యంగా మహిళలు చేనేత వస్త్రాలు ధరించేలా కృషి చేసి చేనేత కార్మికుల ఉపాధి అవకాశం పెరిగేలా చూడాలి. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరాని కి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.2.69 కోట్ల ఆర్ధిక ప్రయోజనం రూ.24 వేలు చొప్పున 1119 మంది బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేశారు. జిల్లాలో 16 ప్రాధమిక చేనేత సహకార సంఘాల కు క్యాష్ క్రెడిట్ కింద రూ.124.63 లక్షలు చేనేత ఉపాధి కోసం మంజురూ చేశారు. వివర్స్ ముద్రా పధకం కింద 2020-21 సంవత్సరం లో 87 మందికి రూ.43.50 లక్షలు మేర రుణాలను అందచేసే అండగా నిలవడం జరిగింది.