-వైఎస్సార్ చేయూతతో పల్లెల్లో క్షీర విప్లవం…
-మహిళలకు పాడి పశువులు గొర్రల యూనిట్లు…
-మహిళల ఆర్థిక ప్రగతికి ఊతం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాడి పశువులు పెంచే వారి ఇళ్లు కళకళలాడడం పరిపాటి. గ్రామ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు పాడి పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేది పశుసంపదే అన్నది గట్టిగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత కింద మహిళలకు ఆర్థిక ప్రగతికి ఊతమించేందుకు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, తదితర జీవాల యూనిట్లను మంజూరు చేస్తోంది. రైతుల ఇళ్లు పాడిపశువులు, జీవాలతో కళకళలాడే యూనిట్లను వైఎస్సార్ చేయూత కింద మంజూరు చేస్తోంది. వైఎస్సార్ చేయూత పథకం కింద పాడిపశువులు, జీవాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి గల లబ్దిదార్లను రైతు భరోసా కేంద్రాల ద్వారా గుర్తించడం జరగుతున్నది. ఈ పథకం కింద రూ. 75 వేల విలువ చేసే పాడి పశు వులు, గొర్రెలు, మేకల యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2020-21లో జగనన్న పాలవెల్లువ కింద 6,345 మంది లబ్ధిదారులకు ఆవులు, గేదెలు యూనిట్లు అందజేసింది. 1933 మేకలు, గొర్రెల యూనిట్లు అందజేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 62.08 కోట్లు రుణం రూపంలో లబ్ది చేకుర్చబడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జగనన్న పాలవెల్లువ కింద 10 వేల మంది లబ్ధిదారులకు జగనన్న జీవక్రాంతి కింద 5 వేల మంది లబ్ధిదారులకు రూ. 56,250 చొప్పున రుణాలు అందించి యూనిట్స్ ఏర్పాట్ల చర్యలను చేపట్టింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం చేయూతను అందిస్తోంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తోంది. పాడి పశువులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాడిపశువులు గొర్రెలు, మేకలు తీసుకున్న మహిళలు వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుని ఆర్థికంగా ఎదగాలని పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టం డా.కె. విద్యాసాగర్ అన్నారు. మావంటి పేదల జీవనోపది, మనుగడకు ముఖ్యమంత్రి జగనన్న ఎన్నో పథకాలు అమలు చేస్తూ తమను ఆర్థికంగా ఆదుకుంటున్నారని అమ్మిరెడ్డి గుడెం, రామన్నపాలెం, సురవరం తదితర గ్రామానికి చెందిన లబ్ధిదారులు చెప్పారు. వైఎస్ఆర్ చేయూత కింద ఇచ్చిన పాడిపశువులను గొర్రెలు, మేకలను బాగా పోషిస్తున్నామన్నారు. పాలు విక్రయించగా డబ్బులతో జీవనం సాగిస్తామన్నారు.