-బ్రాహ్మణుల పూర్వ వైభవాన్ని ఇనుమడింపజేసిన ఘనత జగనన్నది: శర్వాణీ మూర్తి, దోనేపూడి శ్రీనివాస్, సుధాకర్, కొండా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వము బ్రాహ్మణుల సాంఘిక, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి విశేష కృషి చేయడం జరుగుతోందని 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, డివిజన్ కో ఆర్టినేటర్ దోనేపూడి శ్రీనివాస్, పరశురామ సేన రాష్ట్ర అధ్యక్షులు చల్లా సుధాకర్, కొండా అన్నారు. గౌరవ శ్రీ మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పేద బ్రాహ్మణుల సహాయార్థం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారని వెల్లడించారు. కనుక టీడీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని.. మల్లాది విష్ణు పై లేనిపోని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బ్రాహ్మణులకు గత చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ వ్యవస్థను పటిష్ట పరిచారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ.. అనేక చారిత్రాత్మక దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో 20 వేల ఆలయాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని.. దేవాలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కు కూడా లేకపోయిందన్నారు. అర్చకులకు వంశపారపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని అవమానించిన వ్యక్తి చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. ఆలయాలపై చంద్రబాబు హయాంలో నియమించిన పాలక మండళ్ళ పెత్తనం అధికమై.. వేధింపులు తట్టుకోలేక అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నది మర్చిపోయారా..? అమరావతి సదావర్తి భూములు సహా.. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములను మింగేశారని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణుల పూర్వవైభవాన్ని ఇనుమడింపజేశారని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వంశపారపర్యానికి ఆమోదం తెలిపి అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దేవాలయాలలో పనిచేసే అర్చకులకు 25శాతం అదనంగా జీతాన్ని పెంచామన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కార్పొరేషన్‌కు, ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ముఖ్య మంత్రి అధిక నిధులు కేటాయించారన్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ. 230 కోట్లు ఖర్చు చేస్తే.. మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా రెండేళ్లలోనే బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ద్వారా రూ. 245 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 15,500 మంది బ్రాహ్మణులకు మాత్రమే పింఛన్ అందుతుండగా.. ఆ సంఖ్యను నేడు 26 వేలకు పెంచచడమైనదని నాయకులు అన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా భార్యభర్తలిరువురికీ పింఛన్ అందేలా జీవో తీసుకువచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇందుకోసం ఏటా రూ. 70 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. కరోనా విపత్తు సమయంలోనూ పేద బ్రాహ్మణులకు ఆర్థిక చేయూతనందించడం జరిగిందన్నారు. పేద బ్రాహ్మణ విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కార్పొరేషన్ ద్వారా వారి ఆర్థిక అవసరాలను తీర్చడం జరిగిందన్నారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలోనూ అర్చక మిత్ర, పురోహిత మిత్ర, ప్రైవేట్ ఉపాధ్యాయులు, చిరువ్యాపారులు, పాత్రికేయులు తదితర బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారికి ఆర్థిక సాయం అందించామన్నారు. కనుక తెలుగుదేశం నాయకులు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బ్రాహ్మణులకు ఎవరి హయాంలో ఎంత మేలు చేకూరందనే దానిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాలు విసిరారు. కనుక మల్లాది విష్ణు గూర్చి మాట్లాడే స్థాయి తెలుగుదేశం నాయకులకు లేదనే విషయాన్ని ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు.