Breaking News

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

– స్పందనలో అధికారుల హాజర గురించి ఆరా తీసిన కలెక్టర్ జె.నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాధికారులతో కలెక్టర్ సమావేశమై జాయింట్ కలక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్ మెంట్) ఎల్. శివశంకర్ , జెసి (హౌసింగ్ ) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ లతో కలసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవాడలో జిల్లా స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మచిలీపట్నంలో జరుగుతాయని ప్రభుత్వ అధికారులు వారి సిబ్బంది అందరు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. డిఆర్‌డిఎ, డ్వా మా, వ్యవసాయ, ఆర్టికల్చర్, ఐసిడిఎస్,మెడికల్ వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలు 9 శకటాలు ప్రదర్శించుటకు మంచి డిజైన్స్ వచ్చేలా, కలర్ ఫూల్ గా ఉండాలన్నారు. రోటిన్ గా కాకుండా భిన్నంగా ఉండాలని అన్నారు. ఐసిడిఎసీశాఖ ద్వారా మహిళలు తయారు చేసే పోషకాహార పదార్థాలు పరిశుభ్రంగా రుచిగా, చూచిగా తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. వివిధ శాఖలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని విఐపిలు పరిశీలిస్తారని అన్నారు. ముందురోజు నుండే పర్యవేక్షించాలన్నారు. మెరిటోరియర్స్ సర్టిఫికెట్స్ ప్రతిపాధించే వారు అన్ని విషయాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారి పేర్లు లిమిట్ గా పంపాలని అన్నారు.
స్పందన గ్రామ సచివాలయాలను సందర్శించినప్పుడు స్పందనలో వచ్చిన అర్జీలు ఏవిధంగా పరిష్కరించారో పరిశీలించాలని సరైన పరిష్కార చర్యలు తీసుకున్నారా? లేదా వెరిఫై చేయాలన్నారు. రైతు స్పందనలో రైతు సమస్యలు నమోదు చేయాలని ప్రత్యేక సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తేవాలన్నారు. త్వరలో యాప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మండల ప్రత్యేకాధికారులు వారి మండలాల్లో వారానికి ఒక రోజు గ్రామ సచివాలయం విజిట్ చేయలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు చెందిన సమగ్ర సమాచారంతో పాటు ఆయా పధకాల లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించుటకు ప్రభుత్వ నిబంధనపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామని అన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో నూరుశాతం బయోమెట్రిక్ అమలు జరిగేలా చూడాలన్నారు. స్పందన అర్జీలలో తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు విన్నకోట అమ్మాజి అభయహస్తం పింఛను 500 రూ.లు మాత్రమే వస్తున్నదని తన ఖర్చులకు సరిపోవడం లేదని వృద్ధాప్య పింఛను మంజూరు చేయించాలని కలెక్టరును కోరగా అభయహస్తం ఉన్న వారికి ఆటోమెటిక్ గా వైయస్ఆర్ పింఛను పధకంలోకి మార్పు చేయవచ్చని ఈ సమస్య పరిష్కరించి వెంటనే పరిష్కారం చేయాలని డిఆర్‌డిఎ అదికారులను కలెక్టర్ ఆదేశించారు.
గన్నవరం మండలం ముస్తాబాద గ్రామానికి చెందిన కూరేటి మురళికృష్ణ తన తండ్రి మిటలరీలో పని చేసి చనిపోయారని మాజీ సైనికుని కోటాలో వ్యవసాయ భూమి ఇప్పించాలని స్పందనలో అర్జీ సమర్పించారు.
కృత్తివన్ను మండలం మాట్లం గ్రామానికి చెందిన మోకా మీరాసా హెబ్ తనకు గల 8 సెంట్ల ఇళ్ల స్థలం ఆక్రమించారని, చంపుతామని బెదిరిస్తున్నారని కావున సర్వే చేయించి న్యాయం చేయాలని ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పందనలో అర్జీ సమర్పించారు. కలిదిండి మండలం పెదలంక పంచాయితీ పెదపుట్లపూడి గ్రామ నివాసి నడకుదిటి శేషగిరి మరియు సోదరులు స్పందనలో ఆర్జీ సమర్పిస్తూ వారిపొలం వేరే వారు దురాక్రమణ చేసి చెరువు త్రవ్వి వేరే వారికి లీజు ఇచ్చారని విచారణ జరిపి తమ భూమి తమకు ఇప్పించాలని న్యాయం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, డ్వా మా పిడి జి.వి. సూర్యనారాయణ, డిఆర్‌డిఎ పిడి ఎం. శ్రీనివాసరావు, డిఎంఅండ్ హెవో డా. సుహాసిని, డిపివో ఎడి జ్యోతి, పిడి హౌసింగ్ కె. రామచంద్రన్ మున్సిపల్ కమీషనర్ సబ్బి శివరామకృష్ణ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *