Breaking News

దోమల నివారణకు యాంటీ మలేరియా ఆపరేషన్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రజలకు దోమ కాటు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు నగరంలో బయాలజీ సూర్యకుమార్ ఆధ్వర్యంలో యాంటీ లార్వే ఆపరేషన్స్ ను విస్తృతంగా చేపడుతున్నారు మలేరియా సిబ్బంది. మంగళవారం ఉదయం 30 వ వార్డు దేవి నగర్ బుడమేరు కెనాల్, 57 వ వార్డు కొత్త ఆర్ఆర్ పెట్ బుడమేరు కాలువ, యం ఎల్ ఆయిల్ స్ప్రే, 60 వ వార్డు వాంబే కాలనీ కల్వర్ట్ పవర్ స్ప్రే & ALO కార్యకలాపాలు, 61 వ వార్డు పాయకాపురం చెరువు తూతుకాడ శుభ్రపరిచే పని, గుర్రపుడెక్కులను బొట్ల సహాయంతో మలేరియా సిబ్బంది పరిశుభ్రపరిచారు. నీటి నిలువలు ఎక్కడ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నీరు నిల్వ ఉన్నచో దోమ పుట్టుకకు కారణమవుతుందని ఎప్పటికప్పుడు యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తూ ప్రజలకు దోమ కాటు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు అన్నారు ఇంచార్జి కమిషనర్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *