Breaking News

పాత్రికేయవృత్తికి నిలువెత్తు నిదర్శనం కీ.శే.తుర్లపాటి కుటుంబరావు…

-పాత్రికేయునిగా నైతిక విలువలకు అగ్రస్థానం.. అందుకే ఆయన పద్మభూషణ్ అవార్డు పొందారు
-నేటితరం పాత్రికేయులకు తుర్లపాటి కుటుంబరావు ఆదర్శప్రాయులు
-సమాజహితం కోసం నిరంతరం పోరాడిన కలం యోధుడు
-సమాచార, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాత్రికేయవృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ నిబద్ద తగల పాత్రికేయునిగా పద్మభూషణ్ అవార్డు పొందిన కీ.శే. తుర్లపాటి కుటుంబరావు నేటితరం పాత్రికేయులకు ఆదర్శప్రాయులని రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కీ.శే. పద్మభూషణ్ తుర్లపాటి కుటుంబరావు 90వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రా ఆర్ట్స్ అకాడమి, కృష్ణకళాభారతి, తెలుగువాహిణి, శ్రీకళాభారతి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జర్నలిస్టులకు సత్కార కార్యక్రమానికి సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ముఖ్యఅతిధి గా హాజరై జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో విలువలకు అగ్రస్థానాన్నిచ్చి వృత్తికే వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తి తుర్లపాటి కుటుంబరావు నేటితరం పాత్రికేయులకు ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ఆయన జర్నలిజం రంగానికి అందించిన సేవలు గుర్తించిన మన దేశానికి రాష్ట్రానికి చెందిన ఎంతోమంది ప్రముఖులు రాజకీయవేత్తలు నుండి ప్రశంసలను అందుకున్నారన్నారు. సమాజహితం కోసం పాటుపడిన కలం యోధునిగా అందరిలోనూ తుర్లపాటి చిరస్మరణీయుడిగా నిలిచిపోతారన్నారు. పూజ్య బాపూజీ అంటే చిన్నతనం నుంచి ఎంతో ఇష్టాన్ని పెంచుకుని స్వయంగా బాపూజీని కల్సి స్వరాజ్యనిధికి ఆర్ధిక సహాయ కార్యక్రమంలో పాలుపంచుకున్నారన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు మొదలుకుని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వరకూ, పి.వి.నరసింహారావు, ఇందిరాగాంధి లతో కూడా పరిచయం గల సీనియర్ పాత్రికేయులన్నారు. ఏవిషయాన్నైనా నిర్భయంగా తనకలం ద్వారా ప్రజల వాణిని వినిపించిన దిట్ట తుర్లపాటి అని మంత్రి అన్నారు. పాత్రికేయ వృత్తితోపాటు సిని జర్నలిజంలో కూడా ఆయన సేవలు అమోఘమన్నారు. ఆంధ్రజ్యోతిలాంటి ప్రముఖ దిన పత్రికకు ఎడిటర్ గా ఆయన అందించిన ఎడిటోరియల్స్ పాఠకులకు ఆలోచనాధోరణిలను రేకెత్తించాయి అనుటలో సందేహం లేదన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని నేటితరం జర్నలిస్టులు గుర్తింపు పొందేందుకు కృషి చేయాలన్నారు. సీనియర్ పాత్రికేయునిగా ఎనలేని సేవలు అందించిన తుర్లపాటి కుటుంబరావు సేవలను గుర్తించి అందుకు అనుగుణంగా గౌరవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు.
శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ తన చిన్ననాటి నుండి కీర్తి శేషులు తుర్లపాటి కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. నీతి నిబద్ధతతో ఆయన జర్నలిస్టు వృత్తిని కొనసాగించి తుదిశ్వాసవరకూ వృత్తికే అంకితమైన గొప్పవ్యక్తి అని కొనియాడారు. ఆయన భౌతికంగా దూరం అయినప్పటికీ ఆయన జర్నలిజంకు పాత్రికేయరంగానికి అందించిన సేవలు ద్వారా ప్రతీ ఒక్కరిలోనూ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారన్నారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆయన పేరున ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువ స్తామని మల్లాది విష్ణు తెలిపారు.
అనంతరం వివిధ దినపత్రికలలో పనిచేసి ఉత్తమ సేవలు అందిస్తున్న జర్నలిస్టులను మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఘనంగా సత్కరించారు. కౌండిన్య (సాక్షి), శ్రీనివాస రెడ్డి (ఆంధ్రజ్యోతి) హుస్సేన్ (ఆంధ్ర ప్రభ) యంజికె. రాజు (ఆంధ్రప్రభ), యస్ కె. బాబు (విశాలాంధ్ర) సుబ్బయ్య (విశాలాంధ్ర) అమ్మాజి (విశాలాంధ్ర) యన్ వియస్. చలపతిరావు (ఆంధ్రభూమి) జి.వి.నరసింహారావు (ఆంధ్రభూమి) పొట్లూరి వెంకట్రావు (ఆంధ్రభూమి) పాషా (ఆంధ్రభూమి)
జయరాం శ్రీధర్ (హిందు) యన్. రాజారావు (ఎడిటర్ వాయిస్) ప్రసాద్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్) వెంకట్రామయ్య (ఫొటో జర్నలిస్ట్ విశాలాంధ్ర) తదితరులను సన్మానించారు.
కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ ఆంధ్రా ఆర్ట్స్ అకాడమి కార్యదర్శి గోళ్ల నారాయణరావు ఐజెయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు తెలుగు కళావాహిణి అధ్యక్షులు చింతకాయల చిట్టి బాబు కృష్ణకళాభారతి అధ్యక్షులు కొప్పరపు బలరాం శ్రీకళాభారతి అధ్యక్షులు సింగం శెట్టి చంద్రశేఖర్ తుర్లపాటి కుటుంబరావు గారి కుమారుడు తుర్లపాటి జవహర్ లాల్ పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *