విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొహర్రం వేడుకల్లో భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలను జారీ చేశారు. ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు తప్పనిసరిగా సంబంధిత మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. మొహర్రం ప్రదర్శన, పీర్ల వద్ద ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. భౌతికదూరాన్ని పాటిస్తూ సాధారణ ప్రజలు, భక్తులను ఎక్కువ మందిని అనుమతించకూడదన్నారు. అశూరానా (పీర్ల చావిడి) వద్ద తగినన్ని శానిటైజర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, అధిక బీపి, గుండెజబ్బులు ఉన్నవారిని అనుమతించకూడదన్నారు. ఊరేగింపుల్లో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలన్నారు. సన్నాయి మేళం మినహా సంగీత బృంద వంటివి ఏర్పాటు చేయకూడదన్నారు. తబరుక్, షర్బత్లను సీలు చేసిన ప్యాకెట్లలో మాత్రమే ఇవ్వాలన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలన్నారు. ఫేస్ మాలను తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. సబ్బు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు వద్ద చేతి రుమాలు, టిష్యూ పేపర్ వంటి అడ్డుపెట్టుకోవాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …