Breaking News

ఇప్పటి వరకూ రేషన్ కార్డులోని సభ్యుల పేర్లు ఈకేవైసీ నమోదు లేనట్లయితే వెంటనే చేయించుకోవాలి…

-ఈ అవకాశం ఈ నెల 25 వరకు కల్పించడం జరిగింది.
-రైస్ కార్డుల్లో ఈకే వైసీ నమోదు లేని వారికి సెప్టెంబరు మాసం నుంచి నిత్యావసర సరుగులు సరఫరా నిలిపివేయడం జరుగుతుంది..
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాయింట్ కలెక్టర్ కే. మాధవీలత ఆదేశముల మేరకు డివిజన్ పరిధిలో రేషన్ కార్డు కలిగియున్న కార్డుదారులు ఇప్పటి వరకు ఈకేవైసీలో తమ పేర్లు నమోదు కాని వారు ఈ నెల 25 లోగా నమోదు చేయించుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ డివిజన్ లోని అన్ని గ్రామాల పరిధిలో గల రేషన్ షాపు నందు కార్డు కలిగివున్న వారందరూ ఇప్పటి వరకు తమ పేరు ఈకేవైసీ లో నమోదు లేనట్లయితే వెంటనే నమోదు చేయించుకోవాలన్నారు. కార్డులో ఉన్నకుటుంబ సభ్యులు ఎవరైన ఒకరు ఈకేవైసీ నమోదు లేనట్లయితే ఆ సభ్యుని పేరు కార్డు నుంచి తొలగించబడును. అదే విధంగా కార్డులో గల సభ్యులు అందరి పేర్లు ఈకే వైసీ లో నమోదు లేనట్లయితే ఆ కార్డు మొత్తము తొలగించబపడుతుందన్నారు. ఈ కే వైసీ చేయించుటకు గ్రామరెవెన్యూ అధికారుల లాగిన్ ద్వారా నోటీసును తయారు చేసి సంబందిత తహశీల్దారు ఆమోదము పొందిన తరువాత వాలెంటీర్ల ద్వారా నోటీసులు ఈకే వైసీ చేయించుకోవలసిన కుటుంభ సభ్యులకు జారీ చేయబడును. కుటుంభ సభ్యులు ఎవరైన వేరే గ్రామాల్లో ఉన్నట్లయితే వారికి చివరి తేదీ సమాచారం అందించి అప్పటి లోగా నమోదు చేయించుకోవాలన్నారు. లేని యడల కార్డు తొలగించబడుతుందని తెలిపారు. సదరు రేషన్ కార్డులో తప్పుగా ఆధార్ నమోదు అయి ఉంటే గ్రామ సచివాలయ రైస్ కార్డు సేవల ద్వారా ఆధార్ కార్డు నెంబరు మార్చుకొనుటకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. చిన్న పిల్లలు ఈకేవైసీ నమోదు చేసుకొనుటకు ముందుగా ఆధార్ కార్డు నందు వారి వేలిముద్ర నవీకరణ (అప్డేట్) చేసుకొనవాన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన నిర్ణీత గడువులోపు రేషన్ కార్డుల్లో ఈకేవైసీ నమోదు ప్రక్రియ చేయించుకోనట్లయితే అటువంటి కార్డులను బోగస్ కార్డులుగా గుర్తించి వారి పేర్లను రైస్ కార్డు నందు తొలగించి సెప్టెంబర్ మాసం నుండి నిత్యావసర సరుకులు సరఫాను నిలిపియేయుట జరుగుతుందని తెలిపారు. వాలెంటీర్లు తమ పరిదిలో గల కుటుంబాల్లో ఈకేవైసీ లేని కార్డు దారుల చేత ఈ నెల 25 వ తేదీ లోగా నమోదు చేయించాలని ఆర్డీవో శ్రీనుకుమార్ ఆదేశించారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *