-కాగితంతో చేసిన జెండాలను మాత్రమే ఉపయోగించాలి…
-సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఎలాంటి ప్లాస్టిక్ జెండాలను ఉపయోగించవద్దని విజయవాడ సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ఈ విషయంపై డివిజన్ లోని వివిధ శాఖ అధికారులకు లేఖ రాస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఎలాంటి ప్లాస్టిక్ జెండాలను వినియోగించకుండా కాగితపు జెండాలను మాత్రమే ఉపయోగించే విషయంపై అందరిలో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని డివిజన్లోని తహాశీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడివోలు, యంఇవోలు, వివిధ శాఖల డివిజనల్ అధికారులు సచివాలయ సిబ్బందికి ఆయన సూచించారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 నిబంధనల ప్రకారం కాగితంతో చేసిన జెండాలను మాత్రమే ఉ పయోగించవలసి వుందన్నారు. జాతీయ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల సందర్భంలలో ప్లాస్టిక్ తో తయారు చేసిన జెండాల వినియోగించకుండా కాగితంతో చేసిన జెండాలను వినియోగించాలన్నారు.