విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే చెల్లించాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని తన సమక్షంలో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆగస్ట్ 17 న రాష్ట్ర వ్యాప్తంగా “సావధాన దినం” పాటించాలని ఏ.పి.యు.డబ్ల్యూ.జే. పిలుపు ఇచ్చింది. యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, ప్రత్యేక ఆహ్వానితుల అత్యవసర సమావేశం బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ కార్యదర్శి నివేదిక ఇచ్చారు. జర్నలిస్టుల అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, ఇళ్లస్తలాలు వంటి సమస్యలపై సమావేశంలో చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమాన్ని చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం అయిన ఆగస్ట్ 17 న రాష్ట్ర వ్యాప్తంగా” జర్నలిస్టు సమస్యలపై సావధాన దినం” పాటించాలని యూనియన్ పిలుపు ఇచ్చింది. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో “సావధాన దినం” పాటించాలని, వివిధ రూపాలలో నిరసనలు తెలపాలని, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించాలని యూనియన్ పిలుపు ఇచ్చింది. ప్రభుత్వం నుండి తగిన స్పందన రాని పక్షంలో విజయవాడలో రెండురోజుల సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐ.జే.యు. ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యులు డి.సోమసుందర్, ఆలపాటి సురేష్, పూర్వాద్యక్షుడు నల్లి ధర్మారావు, రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షులు పసుపులేటి రాము, కే.జయరాజ్, కార్యదర్శి ఎం.శ్రీరామ్మూర్తి, కోశాధికారి ఏ.వి.శ్రీనివాస రావు, సామ్నా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వర రావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్.వి.చలపతి రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.భక్తవత్సలం, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మీరా, కార్యదర్శి ఏచూరి శివ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …