విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ అన్నారు. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ఆవరణలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ముందస్తు చర్యలపై ప్రొటోకాల్ డైరెక్టరు, జిఐడి డిప్యూటి సెక్రటరీ యం. బాలసుబ్రహ్మణ్యం రెడ్డితో కలిసి జిల్లాకలెక్టరు జె.నివాస్ లైజనింగ్ డిపార్ట్ మెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ఆగష్టు 15 శనివారం నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలను శాఖలవారీగా చేపట్టవలసిన అంశాలను ముందస్తుగా రూపొందించుకోవాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వేడుకలకు ఆహ్వానితులను పిలవడం జరుగుతోందని, అదేవిధంగా నిర్దిష్టమైన గుర్తింపుకార్డు ల ఆధారంగానే స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. ఆహ్వానితులకు సంబంధించి పాన్లను జారీ చేయడం జరుగుతోందని, ప్రముఖులు, గౌ. మంత్రులు, గౌ. పార్లమెంటుసభ్యులు, గౌ. శాసనమండలి సభ్యులు గౌ. శాసనసభ్యులు, స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించి పార్లను జారీ చేయడం జరుగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణ చేయడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఆహ్వానితులు, ప్రముఖులు నిర్దేశించిన సమయానికల్లా వారికి కేటాయించిన ప్రదేశాలలో ఆశీనులు అయ్యి సహకరించాలని విజ్ఞప్తి చేసారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
నగర పోలీస్ కమిషనరు బి. శ్రీనివాసులు మాట్లాడుతూ భద్రత, బందోబస్తి, ఆహ్వానితులకు జారీ చేసే పాన్ల విషయంలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. కరోనా
నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భౌతికదూరం పాటిస్తూ కవాతు ప్రదర్శనలు, సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయన్నారు. పోలీస్ విభాగంలోని వివిధ అధికారులు చేపట్టాల్సిన భద్రత, రోప్ టీమ్, ఎ ంట్రి గేట్ లకు సంబంధించి సూచనలను ఆయన జారీ చేసారు.
నగర మున్సిపల్ కమిషనరు వి. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్టేడియం ఆవరణలోకి ఆహ్వానితులను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. శానిటేషన్ సిబ్బంది, డాక్టర్లు, తదితర శాఖల సిబ్బంది ప్రొటోకాలకు అనుగుణంగా స్టేడియంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేయాలని, మాస్క్ లు లేనివారికి డిస్పోజల్ మాస్క్లను అందుబాటులోకి ఉంచుతామని, అయినా కూడా ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుందని, కోవిడ్ ప్రొటోకాలను పాటించాలని తెలిపారు.
డిసిపి విష్ణువర్ధన్ రాజు మాట్లాడుతూ స్టేడియం ఆవరణలోకి ఆహ్వానితులు నిర్ణీత ప్రవేశ ద్వారాలు ద్వారా మాత్రమే ప్రవేశించాలని, వారికి జారీచేసే పాన్లపై కారు పార్కింగ్ కు కూడా నిర్ణీత ప్రదేశాలను సూచించామన్నారు.
ఈసమావేశంలో సబ్ కలెక్టరు జియస్ యస్ ప్రవీణ్ చంద్, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్ బి, మున్సిపల్, విద్యుత్తు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.