-శ్రీ దుర్గా అమ్మవారి విశ్వ జనని భక్తజన సంఘం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా అమ్మవారి విశ్వ జననీ భక్త జన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు మేజర్ కౌత సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ సర్వ జీవులలో అంతరంగిక శక్తిగా శ్రీ దుర్గా మాత కొలువై ఉన్నదని అమ్మవారి శక్తిని అందరూ గ్రహించి పూజించ డం ద్వారా అమ్మవారి అను గ్రహాన్ని పొందవచ్చు అన్నారు. విశ్వజనని భక్త జన సంఘం ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన ఘంటసాల సంగీత కళాశాల దుర్గాపురం లో సాయంత్రం ఐదు గంటల నుండి సాంస్కృతిక నృత్యాలు, భక్తి గీతాలాపనల పోటీలు జరుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాతవాహన కళాశాల కరస్పాండెంట్ నిడుమొలు రామ సత్యనా రాయణ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామ హేశ్వరరావు, ప్రముఖ వ్యాపార వేత్త కోగంటి సత్యనారాయణ మరియు ప్రముఖులు హాజరవుతారని పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ జనని భక్త జన సంఘం చైర్మన్ బయ్యపు సుబ్బారావు, డాక్టర్ ఆర్. సురేష్, బి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News