విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా అక్షయపాత్ర ఫౌండేషన్ వారు చేపడుతున్న సామాజిక సేవ కార్యక్రమలు అమోఘం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 11,12,13 డివిజిన్లలో అక్షయపాత్ర వారి ఆధ్వర్యంలో దాదాపు 600 మందికి ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ పేదలకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కరోనా సమయంలో కూడా అక్షయపాత్ర వారు ఎన్నో సేవ కార్యక్రమలు చేపట్టారని, నేడు కూడా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు నెలరోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయం అని, వారు భవిష్యత్ లో చేపట్టబోయే సేవ కార్యక్రమలకు తన వంతు సహాయసహకారాలు అందజేస్తానని అవినాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అక్షయ ఫౌండేషన్ శ్రీహరి,వెంకట్రావు, వైసీపీ నాయకులు మాగంటి నవీన్,సందీప్ రెడ్డి,గల్లా రవి,చిమాటా బుజ్జి, ధనికులు కాళేశ్వర రావు,శేటికం దుర్గ,బచ్చు మురళి, సొంగా రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …