విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజిన్ రఘు గార్డెన్స్ వద్ద 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవినాష్ పూజ కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు రఘు గార్డెన్స్ రోడ్డు, మసీదు రోడ్డు నిర్మించాలని కోరగా నాడు హామీ ఇచ్చిన మేరకు సంబంధిత మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేపించడం జరిగిందని, రేపటి నుండే పనులు మొదలుపెట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు అవినాష్ సూచించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ ప్రక్క సందులోనే నివాసం ఉంటారని, ఆయన సొంత డివిజిన్ సొంత ఇంటి పక్కల రోడ్లు వెయుంచుకోలేని పరిస్థితి అని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో అభివృద్ధి కి నోచుకోలేదని,ఈ రోడ్డు గురుంచి స్థానిక ప్రజలు,పెద్దలు ఎన్నిసార్లు ఆయనకు మొరపెట్టుకొన్న సరే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు.కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం మొత్తాన్ని సమ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తున్నారని, అందుకే ఓడిపోయిన సరే ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసారని కొనియాడారు.వైసీపీ ఎప్పుడు కూడా ఓట్లు కోసం రాజకీయాలు చెయ్యలేదు అని ప్రజా సంక్షేమం ధ్యేయంగా పని చేస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, వైసీపీ నాయకులు కాళేశ్వర రావు,మునీర్ అహ్మద్, కలీమ్,చిన్న,శ్రీనివాసరావు, రంగారావు,రాందాస్, షాజుద్దీన్, కభీర్త దితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …