Breaking News

ఐటీఐలో ప్రవేశము కానున్న విద్యార్థులు ఈ నెల 16 వతేదీలోపు ధృవ పత్రాల వెరిఫికేషన్ చేయించుకోవాలి…

-ప్రిన్స్ పల్ శ్రీనివాసరాజు

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేబీఆర్ ప్రభుత్వ ఐ.టి.ఐ గుడివాడ లో 2021-2022 విద్యా సంవత్సరముకు గాను ప్రవేశమునకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐ.టి.ఐ లలో ధరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులకు ముఖ్య గమనిక ఈ విద్యా సంవత్సరము నుండి ప్రవేశపెట్టిన నూతన విధానము ప్రకారము ధరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులు అందరు తేదీ 13-08-2021 (శుక్రవారము) నుండి తేదీ 16-08-2021 (సోమవారము) వరకు కేబీఆర్ ప్రభుత్వ ఐ.టి.ఐ గుడివాడ నందు తమ యొక్క ఒరిజనల్స్ సర్టిఫికేట్లు ( 10 వ తరగతి మర్కుల లిస్టు, టి.సి , కుల ధృవీకరన పత్రం , స్టడీ సర్టిఫికేట్లు , ఆధార్ , మరియు ధరఖాస్తు చేసుకున్నా పత్రం ) అన్నియు సమర్పించి ప్రిన్సిపల్ గారి ద్వారా వెరిఫికేషన్ సంతకం చేయెంచుకుని వెబ్ సైట్ నందు ధృవిరకరించు కొనవలెను . అట్లు చేయని యెడల వారి యొక్క ధరఖాస్తు తిరస్కరించబడునని కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వి.శ్రీనివాస రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మీకు ఆ విధమైన సందేహాలు వున్న యెడల 08674-295953 నెంబర్ నందు సంప్రదించగలరు .

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *