గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర -2025 ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పేర్కొన్నారు.
తాడేపల్లిలోని ఉండవల్లి గుహల వద్ద ఈ నెల 28 వ తేదీన యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న నేపధ్యంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారం మధ్యాహ్నం జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ ఆలీమ్ బాషా తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులతో మాట్లాడుతూ ఉండవల్లి గుహల వద్ద , కొండపైన చదును ప్రదేశంలో దాదాపు 200 మందితో యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించుటకు నిర్ణయించారు. ఈ యోగా కార్యక్రమం పీడీ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ యోగా శిక్షకులతో ఈ నెల 28 వ తేదీ ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాట్లను , పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ను ఏర్పాటు చేయవలసిందిగా యంటీయంసీ కమిషనర్ ను, పీడీ మెప్మా ను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధికారులతో సమన్వయం చేసుకొని నిర్వహించాలని , యోగా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జూన్ 21 న యోగా దినోత్సవంలో పాల్గొనే ఆశక్తి వున్నవారు యోగాంధ్ర వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవలసిందిగా సూచించారు.
ఈ కార్యక్రమంలో పీడీ మెప్మా టి. విజయలక్ష్మీ , జిల్లా టూరిజం ఆఫీసర్ శ్రీ రమ్య, ఆయుష్ శాఖ అధికారి డా. అనిత , యంటియంసీ అసిస్టెంట్ కమిషనర్ జి. శ్రీనివాస రావు , డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ , తాడేపల్లి తహశీల్దార్ సీతారామయ్య , ఏఈ లు , డిఈ లు , సర్వేయర్లు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News