Breaking News

పవన్ కళ్యాణ్  జన్మదినాన్ని పురస్కరించుకొని 50 మంది సామాన్యులకు నిత్యవసర సరుకులు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సెప్టెంబర్ 2న 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన కువైట్ వారు 30 రోజులు 30 ప్రాంతాలు 30 సేవా కార్యక్రమాల్లో భాగంగా 14 వ రోజున 50 మంది సామాన్యులకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గం లో పగడాల లక్ష్మణ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్, పార్టీ నాయకులు ఆలమూరి సాంబశివరావు మైలవరపు కొండలరావు ఉమ్మిడి కృష్ణ షేక్ మొబినా అమీర్ భాషా నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్ బోలిసెట్టి .వంశీ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు 50 కుటుంబాలకు అందజేసిన అనంతరం నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావాలంటే పవన్ కళ్యాణ్  స్పందిస్తే నే నేటి ప్రభుత్వాo కూడా తల ఉంచుతున్నాయని, పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాయని, నూతన రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారి నాంది పలికారని, సమాజంలో మార్పు రావాలంటే జనసేన పార్టీని ఆదరించాలని, ఒక అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి  పాలనలో అధోగతి పాలు అయిందని ఉపాధి ఉద్యోగ అవకాశాలు దూరం అయిపోయాయని అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి పోయి ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోయిందని, పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవడం నియోజకవర్గ దౌర్భాగ్యం అని మంత్రి అవినీతి మీద పెట్టిన దృష్టి కనీసం ఒక్క శాతం కూడా అభివృద్ధి మీద పెట్టలేదని అందుకనే అన్ని ప్రధాన రహదారులు గోతులు మాయమైపోయఅని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి వ్యక్తులు మరొకసారి అవకాశం ఇవ్వవద్దని ఓడిపోయిన ప్రజల మధ్య తిరుగుతున్న జనసేన పార్టీకి అవకాశం కల్పించాలని కోరారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *