విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీవెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 11 న అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిసాయి. 14వ చతుర్దశ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు స్వామి వారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే వసంతోత్సవం, చక్రస్థానం అనంతరం పూర్ణోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్ పి రమణమూర్తి, విజిలెన్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళ శ్రీనివాసరావు (అడ్వకేట్) కార్యవర్గ సభ్యులు మజ్జి శ్రీనివాసరావు, కామాంధుల నరసింహారావు, పోతిన సాంబశివరావు, శ్రీమతి తమ్మిన సూర్యకుమారి, నగరాల కుల పెద్దలు చింతాడ వెంకట రాము, మాకిన సత్యనారాయణ, రాంపిళ్ల వాసు, నాగోతి వాసు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News