పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ జి.యస్.యస్.ప్రవీణ్ చంద్ పెనమలూరు తహశీల్దారు వారి కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. మండల స్థాయి అధికారులతో ఈ దిగువ విషయముల పై సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలు, ఫీవర్ సర్వే జాగ్రత్త గా నిర్వహించుటo పై పలు సూచనలు అందజేశారు. కోవిడ్-19 నియమ నిబంధనలు అమలు పరచుట,స్పందన కార్యక్రమము నందు వచ్చిన దరఖాస్తులు సత్వర పరిష్కారము చేయుడం పై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ స్పందన కార్యక్రమము అమలు చేసి ఆర్జీలు సత్వర పరిష్కారము చేయాలన్నారు. నవరత్నములు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమము లో గృహ నిర్మాణ కార్యక్రమములు త్వరితగతిన పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులు అందరుకు అన్ని ప్రభుత్వ పధకములు చేరు లాగున తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమము నందు తహశీల్దారు జి.భద్రు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి విమాదేవి, హౌసింగ్ డి.ఈ. భాస్కరరావు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రము డాక్టర్ రవి కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఈ ఓ పి ఆర్డ్ శ్రీనివాసరావు, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజు , పౌర సరఫరా శాఖ ఉప తహశీల్దారు రామకృష్ణ, తహశీల్దారు కార్యాలయపు ఉప తహశీల్దారు ఆది లక్ష్మి, మరియు సంబంధిత శాఖలు కు చెందిన మండల స్థాయి సిబ్బంది అందరు పాల్గొని యున్నారు.
పెనమలూరు మండల రెవిన్యూ ఇనస్పెక్టర్ జి.వి.యస్.రమేష్ కృష్ణా జిల్లా కలెక్టర్ వారిచే ఆగస్టు 15 న ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సందర్భము గా పెనమలూరు తహశీల్దారు వారి కార్యాలయము నందు తహశీల్దారు వారి కార్యాలయపు సిబ్బంది, గ్రామ రెవిన్యూ అధికారులు, గ్రామ సహాయకులు, మండల స్థాయి అధికారులు సన్మానం చేసారు.
ఈ కార్యక్రమము నందు తహశీల్దారు జి.భద్రు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి విమాదేవి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ , హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజు గారు, పౌర సరఫరా శాఖ ఉప తహశీల్దారు రామకృష్ణ, తహశీల్దారు కార్యాలయపు ఉప తహశీల్దారు ఆది లక్ష్మి, గ్రామ రెవిన్యూ అధికారుల డివిజన్ సంఘము అధ్యక్షులు శ్రీ ప్రసాద్ గారు మరియు అందరు గ్రామ రెవిన్యూ అధికారులు, గ్రామ సహాయకులు మరియు కార్యాలయ సిబ్బంది, ఇతర శాఖలు కు చెందిన మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.