విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా షిర్డీ ముత్యాలంపాడు షిర్డీసాయి బాబా మందిరంలో ఈ నెల 10వ తేదీ గురువారం గురుపూర్ణిమ మహోత్సవంను ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యాన శ్రీ గురుపూర్ణిమ మహోత్సవ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహి మాన్వితమైన శక్తిసంపన్నులు సద్గురువు శ్రీసాయి నాథుడు అన్నారు. సాయి బంధువులు బాబావారి మందిరంలో శ్రీగురు దత్తాత్రేయస్వామి సన్నిదిలో జరిగే గురుపూర్ణిమ మహోత్సవాల్లో పాల్గొని బాబావారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. 10వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు కాకడ హారతితో గురుపూర్ణిమ ఉత్సవాలు ప్రారం భమవుతాయన్నారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనము, పంచామృతములతో సహస్ర కలశాభిషేకం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాలుగు గంటలకు ఒక్కసారి బాబావారికి దత్తాత్రేయ స్వామివారి విశేష అర్చనలు జరుగుతాయన్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశామన్నారు. అలాగే గురుపూర్ణిమ మహోత్సవం పురస్కరిం చుకుని సద్గురువులకు సత్కారం చేయటం జరుగు తుందన్నారు. భక్తులు బాబావారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News