Breaking News

ఆషాఢమాస సారె సమర్పణ…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా మణులు ఆషాడ మాసం ప్రారంభం కావడంతో జగన్మాత ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ కు ప్రీతి కలిగించే విధంగా ఆషాఢమాస సారె సమర్పణ, ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి మహిళా ముతైయిదువులు, భక్త బృందాలుగా కనకదుర్గమ్మ ఆలయానికి తరలి వచ్చారు. మహిళా ముతైయిదువులు ఇంటి వద్ద లక్ష్మీ పూజలు చేసుకున్న అనంతరం మూకుమ్మడిగా కనకదుర్గమ్మ తల్లి ఆలయాన సారెలు అందించేందుకు ఆషాడ మాస పూజా కార్యక్రమాలకు ముకుమ్మడిగా బృందాలుగా ఆలయ ప్రాంగణానికి ఊరేగింపుగా వెళ్లి ఇంద్రకీలాద్రి మీద అమ్మ వారికి మనసారా మొక్కి, సారెలు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, మిఠాయిలు, పళ్ళు, కొబ్బరికాయలు మహా మండపంలో సమర్పించారు. ఆలయప్రాంగణం భక్తులతో కిట కిటలాడింది. ఈ కార్యక్రమంలో బావాజిపేట నుండి భారీ సంఖ్యలో మహిళా ముతైయిదువులు అమ్మవారిని దర్శించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *