-జాయింట్ కలెక్టర్ (అభివద్ధి) ఎల్. శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారుల్లో శ్వాసకోస వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న న్యూమెకోకల్ కాంజుగేట్ (పిసివి) వ్యాక్సినను చిన్నారులకు వేయించడంలో తల్లిదండ్రులను చైతన్య పరచి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ తెలిపారు.
న్యూమెకోకల్ కాంజుగేట్ (పిసివి) వ్యాక్సిన్ పై శనివారం జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ సంబంధిత అధికారులతో విజయవాడలోని ఆక్సిజన్ వార్ రూమ్ నందు జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు శ్వాసకోస వ్యాధి బారినపడకుండా న్యూమె కోకల్ కాంజుగేట్ (పిసివి) వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందించనున్నదన్నారు. ఒక సంవత్సరంలోపు పిల్లలకు 6 వారాలకు ఒక డోసు 14 వారాలకు ఒక డోసు 9 నెలలకు మరియొక డోసు ప్పున 3 డోసులుగా వ్యాకినను అందించడం జరుగుతుందన్నారు. వచ్చే వారం నుండి వ్యాక్సిన్ను పిల్లలకు అందించే కార్యక్రమం ప్రారంభించే అవకాశం వుందన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలనే ఆయన వైద్యాధికారులకు ఆదేశించారు. వ్యాక్సిన్ అత్యంత ఖరీదు అయిన వ్యాక్సిను డోసులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదన్న సమాచారన్ని తల్లిదండ్రులకు తెలియజేసి వ్యాక్సిన్ వారి పిల్లలకు వ్యాక్సిన్ వేయించేలా అవగాహన కల్పించాలన్నారు.
సమావేశంలో జిల్లా వైద్య అధికారిణి యం సుహాసిని, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసరావు, డిఇవో తహేర సుల్తానా, ఐసిడిఎస్ పిడి ఉమారాణి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిని డా. శర్మిష్ఠా, డిప్యూటి డియంహెవోలు మున్సిపల్, కమీషనర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.