ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కైకలూరు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేవిధంగా పనిచేస్తున్న డిఎన్ఆర్ శాసనసభ్యులుగా ఎన్నుకున్న ప్రజలు అదృష్ట వంతులని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు.
మంగళవారం ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రం,డా.వై.ఎస్.ఆర్ వెల్ నెస్ సెంటర్ మరియు బల్క్ మిల్క్ ప్రాజెక్టు భవనాలకు ఎమ్మెల్యే డిఎన్ఆర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు యంపీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత జగనన్న ప్రభుత్వంలో ఏ ఊరు చూసినా కళకళ లాడుతుందన్నారు.పూర్వం ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఏదో ఒక చిన్న గది మాత్రమే ఉండేదని,కానీ ఇప్పుడు పరిస్థితి ఎంతో భిన్నంగా ఉందన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేట్ స్థాయిలో నిర్మించడమే కాకుండా పాలనను ప్రజలకు అతి చేరువ లోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.
ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యుల్ని చేసి సంక్షేమం అభివృద్ధిని సమపాళ్లలో అందించడం జరుగుతుందన్నారు. కేజీ నుండి పీజీ దాకా పేద మధ్యతరగతి పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు జగనన్న కంకణ బద్దుడై పనిచేస్తున్నారన్నారు.విద్య వైద్యం ఉపాధి రంగాల్లోనే కాకుండా రైతులకు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చి పాలన జరుగుతుందని అన్నారు.అందరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములై వస్తే తనవంతు సహకారం అందించి గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఎమ్మెల్యే అన్నారు
కార్యక్రమంలో తాహశీల్థారు శ్రీనివాస్, ఎంపీడీఓ మాధవరావు, పీఆర్ డీఈఈ సురేష్, మండల పార్టీ అధ్యక్షులు బొర్రా శేషుబాబు, జడ్పీటీసీ అభ్యర్థి ఈడే వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ అభ్యర్థి రామిశెట్టి సత్యనారాయణ,నిమ్మగడ్డ బిక్షాలు, మండల ప్రముఖ నాయకులు, అబ్బీశెట్టి నాగబాబు( ఎఎన్. బాబు ), కోమటి విష్ణు,,, రామిశెట్టి కొండ,, ఎంపీటీసీ పేరం నాగలక్ష్మి,,, బోయిన రామరాజు,,, సాక్షి సాయిబాబు,,, షేక్ అల్లాభక్షు,ఎంపీటీసీ, చోపర్ల సునీత,పీఏసీఎస్ అధ్యక్షులు బోయిన వరప్రసాద్, రాచూరి కుమార్, వల్లభనేని వెంకటరావు, వల్లభనేని సుబ్బారావు, మొట్రు ఏసుబాబు, ముత్యాల రాంబాబు, గోరుమచ్చు సామీయేలు, మరీదు రాధాకృష్ణ, పేరే రామకృష్ణ, కాగిత రామారావు, చిట్టూరి నాంచారయ్య, బేతపూడి వెంకటరమణ, శీలం రామకృష్ణ,దాసరి శ్రీనివాస్, పేర్ని పృథ్వి, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Tags mudineaypalli
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …