Breaking News

ప్రతి ఫిర్యాదును శాశ్వతంగా పరిష్కరించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను, శాఖధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 5, ఇంజనీరింగ్ 4, రెవెన్యూ సంబంధించినవి 3, వైద్య & ఆరోగ్యం 2, ఎస్టేట్ 2, హౌసింగ్ ఒకటి మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్. డాక్టర్ డి చంద్రశేఖర్ తో పాటు చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ కేబిఎన్ఎస్ లత, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి. సత్యకుమారి,పి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *