Breaking News

ఆటోమ్యూటేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్తి పన్ను పై పేరు మార్పునకు ఆటోమ్యూటేషన్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం నగర ప్రజలను కోరారు. బుధవారం నాడు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆగస్టు 1, 2025 నుండి రాష్ట్రమంతా ఈ సేవలు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ జరుగుతున్న సమయంలోనే ఆస్తి పన్ను లోని పేరు మార్పు జరుగుతుందని తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆస్తి యజమాని పై పన్ను పేరు మార్పుకు జాప్యం తొలగించేందుకు ప్రభుత్వం ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ లో భాగంగా మ్యూటేషన్ ప్రక్రియను సులభతరం చేసిందని అన్నారు. ఇకపై ఆస్థులు కొనుగోలు, అమ్మకాలు జరిగినప్పుడు పన్ను మార్పుకు కార్పొరేషన్ కు రావాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆస్థి, ఖాళీ స్థలములపై ఉన్న పాత బకాయిలు చెల్లించి, పన్ను పేరు మార్పునకు సంబంధించిన మ్యూటేషన్ చార్జీలు చెల్లించిన వెంటనే పన్ను పేరు మార్పు పత్రమును ఎటువంటి జాప్యం లేకుండా మ్యూటేషన్ పత్రాలు పొందవచ్చని కమిషనర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కమిషనర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *