Breaking News

జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్…

-శనివారం సాయంత్రం 5 గంటల వరకు 71,593 మందికి కోవిడ్ టీకా అందజేత…
-జిల్లాలో ఇంతవరకు 25,92,329 మంది కోవిడ్ టీకా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. జిల్లాలో శనివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషను 1,02,000 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేశారు. ఇందుకోసం 145 కోల్డ్ చైన్ సెంటర్లను అందుబాటులో వుంచారు. శనివారం ఉదయం 10 గంటలకు కేవలం 10 వేల కోవిడ్ టీకాలను వేయడం గమనించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్ టెలికాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేసే చర్యలు చేపట్టారు. యంపిడివోలు, తహాశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం పెట్టిన ఆయన ఒక్కో వాలంటీర్ కనీసం 20 మందిని తీసుకుని రావాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి ఆదేశాలు ఇవ్వలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో దిగువనున్న జిల్లా స్థానం అగ్రస్థానానికి ఎగబాకింది. సాయంత్రం 5 గంటలకు 71,593 మందికి కోవిడ్ టీకాలు వేయడం జరిగింది.
అంతే కాకుండ జిల్లా వ్యాప్తంగా పలువురు ఉన్నతాధికారులను ఆయా ప్రాంతాల పర్యవేక్షణకు పంపారు. దీంతో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. గూడురు మండలం కోకా నారాయణపాలెంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్, కంట్రోల్ రూమ్ నుంచి కింది స్థాయి అధికారులకు ఆదేశాలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారన్ని తెప్పించుకున్నారు. బిసి కార్పొరేషన్ ఇడి కేసరపల్లి, గన్నవరం గ్రామల్లో పర్యాటించారు. నిర్మాణంలో ఉన్న ఆర్టికే సచివాలయ భవనాలను తనిఖీ చేశారు. డిఎస్పీ బిఎస్ఎన్ నారాయణ, డ్వామా పిడి సూర్యనారాయణ, జడ్పి సిఇవో సూర్యప్రకాష్, బిసి సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీదుర్గ తదితర అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఇది ఇలా వుండగా జిల్లాలో ఇంతవరకు 25,92,329 మంది కోవిడ్ టీకాలు పొందారు. వీరిలో 19,15,418 మంది మొదటి డోసు పొందగా 6,76,911 మంది రెండవ డోసు కోవిడ్ టీకాలను పొందారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *