ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన అంశాన్ని ప్రశ్నించారు. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా నవంబర్ – 2022 నుండి మే 2025 వరకు అందిన ఫిర్యాదులు, పరిష్కరించబడిన ఫిర్యాదులు, పరిష్కరించడానికి తీసుకొన్న సగటు సమయం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అండ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా 2022 నవంబర్ నుండి 2025 మే వరకు అందిన ఫిర్యాదులు, పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్య, వాటి పరిష్కారానికి తీసుకున్న సగటు సమయం, అలాగే వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై వివరణ కోరారు.
సిపిజిఆర్ఎఎంఎస్ ద్వారా ప్రజా ఫిర్యాదులని సమర్థంగా పరిష్కరిస్తున్నట్టు సంబంధిత కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. 2022 నవంబర్ 1 నుండి 2025 మే 26 వరకు 42.62 లక్షల ఫిర్యాదులు అందగా, వాటిలో 42.73 లక్షల ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని తెలియజేసారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు 64,960 మాత్రమే కాగా, ఫిర్యాదుల సగటు పరిష్కార సమయం 16 రోజులుగా నమోదైందని తెలియజేశారు.
వ్యవస్థ సామర్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 10 దశల సంస్కరణలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆధారిత విశ్లేషణ, దేశంలోని 22 భాషల్లో సేవలు అందుబాటులోకి తీసుకురావడం, అలాగే మూలకారణ విశ్లేషణ కోసం డేటా స్ట్రాటజీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ప్రజా ఫిర్యాదులపై శాఖల పనితీరును తెలుసుకునేందుకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అసెస్‌మెంట్ అండ్ ఇండెక్స్ ను ప్రవేశపెట్టిందని తెలిపారు. తద్వారా పారదర్శకతతోపాటు ఉన్నతస్థాయి పరిశీలనకు అవకాశం ఏర్పడుతోందని తెలియజేసారు. గ్రామీణ ప్రాంతాల్లో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవల విస్తరణ, ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్ల ద్వారా ప్రజల స్పందనను పరిగణనలోకి తీసుకునే విధానం ఉన్నాయని తెలిపారు. అలాగే, 2024 ఆగస్టులో విడుదలైన మార్గదర్శకాల్లో పరిష్కార గడువును 30 రోజుల నుంచి 21 రోజులకు తగ్గించారని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News